భగత్‌సింగ్ కు ఘన నివాళులు..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : దేశ స్వాతంత్రం,సమానత్వం కోసం ప్రాణత్యాగం చేసిన వీర విప్లవకారులు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖదేవ్ ఆశయాలను నేటి యువతరం సాధించాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి పిలుపునిచ్చారు. మండల కేంద్రం నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో వీర విప్లవకారుల 95వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, చిన్న వయసులోనే సమ సమాజం స్థాపన లక్ష్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన ఈ మహనీయులు నేటి యువతకు ఆదర్శమని అన్నారు.ప్రపంచంలో ప్రత్యక్ష సామ్రాజ్యవాదం తగ్గినా, పరోక్ష సామ్రాజ్యవాదం ఇంకా కొనసాగుతూనే ఉందని, ప్రపంచ దేశాలపై దాడులు, వనరుల దోపిడీ ద్వారా ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని విమర్శించారు.

నేటి పాలకులు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు,దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని, ఎన్నికల హామీలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతోందని విమర్శించారు.దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు, ప్రకృతి వనరులు ప్రజలకు అందేలా చేయేందుకు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా లభించేలా చేయడానికి యువతరం కుల, మత, రాజకీయ భేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి, మామిండ్ల చిన్న ఐలయ్య, మనుగొండ ప్రసాద్, బి. మల్లయ్య, కనకం సాల్మన్, పొడేటి సాల్మన్, కోడూరు శ్రీనివాస్, కోడూరు సిద్ధూ, కొండి సదయ్య, పరికి ఆనందం, అల్లెరాజు భాష, బోయిన సమ్మయ్య, మర్రి రవి తదితరులు పాల్గొన్నారు.