TG | ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి రేవంత్ భూమిపూజ
హైదరాబాద్ : గోషామహల్‌లో ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు. రెండువేల బెడ్స్ సామర్థ్యంతో దీని నిర్మాణం ఉంటుంది.
ఇన్‌పేషంట్‌తో పాటు అవుట్ పేషంట్ సేవలతో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తారు. భారత్‌లోనే అతిపెద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు, ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. అన్నిరకాల డయాగ్నొస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయి.