ఇందిరమ్మ ఇల్లు రాలేదని.. మహిళ ఆత్మహత్యాయత్నం

మునగాల, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపానికి గురైన మహిళ కలెక్టర్ ఎదుట నిర్వహించిన సమావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మునగాల మండల కేంద్రంలో గురువారం జరిగింది. ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో సమావేశం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పి నరసింహలు హాజరయ్యారు. సమావేశంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆర్థనాథాలు చేస్తూ కోట సునీత అనే మహిళ అధికారులు గ్రామస్తుల ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఆమెని చికిత్స నిమిత్తం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు.

Leave a Reply