ఆలేరు శ్రీరంగ క్షేత్రంలో గోశాల షెడ్డు నిర్మాణానికి శ్రీకారం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని అపర శ్రీరంగంగా పేరొందిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో గోశాల షెడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. దాత మారుపాక గోవర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గోశాల నిర్మాణానికి సహకరిస్తున్న దాత మారుపాక గోవర్ధన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గోవర్ధన్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
