ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ దంపతులు
మోత్కూర్ (ఆంధ్రప్రభ): తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల, వెంకటేశ్వర్లు గౌడ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో బర్త్డే కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే సామెల్ మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
