మాజీ ఎంపీటీసీ దాసోజు సుధారాణి ఆకస్మిక మృతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు దాసోజు భిక్షమాచారి సతీమణి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దాసోజు సుధారాణి బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందింది.

సుధారాణి మృతి పట్ల మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, దోనూరు వీరారెడ్డి, దూడెల భిక్షం గౌడ్, రమణగోని శంకర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, కడారి ఐలయ్య యాదవ్ తదితర నాయకులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గుర్తు దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Leave a Reply