ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అవుసలోనిపల్లి సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్య అన్నారు. శుక్రవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ. 5 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డుపనులుప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననిఅన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గుర్తించిన వివిధ సమస్యలు పరిష్కరించడంతోపాటు గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాననిఅన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగంచేసుకొనిఆర్థికంగా అభివృద్ధిచెందాలన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు త్రాగాలన్నారు. గ్రామంలోని ప్రతి వార్డులో డ్రైనేజీలు సిసి రోడ్ల ఏర్పాటుకుకృషిచేస్తానన్నారు. గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహిళగా గ్రామస్తులు ఆదరించి గెలిపించాలని సేవ చేసి ప్రజలరుణం తీర్చుకుంటామనిఅన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తాననిఅన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాధురిక,మాజీ సర్పంచ్ హన్మంతు, మాజీ ఎంపిటిసి వెంకటయ్య వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
