ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్

ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ నియోజకవర్గం వోట్టెం కుమ్మెర పంప్ హౌస్ లకు సీఎం వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులను నాగర్ కర్నూల్ లో బిజినపల్లి , తాడూరు తెలకపల్లి పోలీస్ స్టేషన్లలో ముందస్తుగా అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్ నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, వంశీ గౌడ్, కిషోర్ గౌడ్, కుమ్మెర తిరుపతయ్యలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మండల కేంద్రాలలో కూడా టీఆర్ఎస్ నాయకులను ఇండ్లలోకి వెళ్లి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపుగా 50 మంది వరకు నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ చర్యల పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను హరించే ప్రయత్నమని ఆరోపించారు.

Leave a Reply