పెద్దజట్రం మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం గ్రామ మహిళ సమైక్య భవనానికి సర్పంచ్ వాకిటి వెంకటేష్, పిఆర్ ఏఈ అజయ్ రెడ్డి, ఏపీఎంహరినారాయణ శుక్రవారంభూమిపూజచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాకిటి వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తుందని గ్రామాల్లో మహిళలు సభలు సమావేశాలు నిర్వహించేందుకు మహిళా సమైక్య భవనాలు నిర్మిస్తుందని అన్నారు. పెద్ద జట్రం మహిళా సమైక్య భవనం అందరి సహకారంతో త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతికిఎంతో కృషి చేస్తుందని పథకాలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలన్నారు. మహిళలు అభివృద్ధి చెందుతే కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనిఅన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కృషి చేస్తానని మహిళలు స్వాశక్తితో ముందుకు వచ్చే వివిధ చేతివృత్తుల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భవిత, సీసీ విజయ్, మహిళా సంఘం అధ్యక్షులు ఇందిరమ్మ జ్యోతి హరిత వార్డు సభ్యులు గౌరమ్మ, నాయకులు వీర రాఘవరెడ్డి, వాకిటి కనకప్ప, రమేష్ తదితరులుపాల్గొన్నారు.
