ఎంపీ సహకారంతో పెద్దజట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాలమూరు ఎంపీ డీకే అరుణ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం లో వీధిలైట్లుఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానని గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని అన్నారు.
ఎంపీడీకే అరుణ నిధులతో సిసి రోడ్లు డ్రైనేజీలు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎంపీ నిధులు విరివిగా తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతాననిఅన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం గ్రామంలో విస్తృతంగా చేపడుతున్నామనిఅన్నారు.
గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించడంతోపాటు వేసవిలో విద్యుత్ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తానన్నారు. గ్రామంలోని 12 వార్డుల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి భవిత వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
