బసవేశ్వర బోధనలు ఆచరణీయాలు: మాజీ సర్పంచ్

వికారాబాద్, ఆంధ్రప్రభ : సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సినవని వికారాబాద్ మాజీ సర్పంచ్ నులి బసవరాజ్ అన్నారు. సోమవారం బసవేశ్వర జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఉన్న బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బసవారాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహానుభావుడు బసవేశ్వరుడని, ఆయన ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం ఆయనను గౌరవించి, ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరసేవ సమాజం వికారాబాద్ అధ్యక్షుడు గంగాడ వీరేశం, ఉపాధ్యక్షుడు బసవరాజ్, నాయకులు శివానందం తదితరులు పాల్గొన్నారు.
