రోడ్డు భద్రతతోనే ప్రమాదాల నివారణ..
- ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు అన్నారు. స్థానిక రింగ్ సెంటర్ లో ద్విచక్ర వాహనచోదకులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహన చోదకులు భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాల రేటును తగ్గించాలని సూచించారు. వెహికల్ చలానా ఉన్నట్లు ఏపీకే ఫైల్ వచ్చినా, ఏదైనా మెసేజ్ వచ్చినా ఓపెన్ చేయవద్దన్నారు. చలానా కట్టాల్సి వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో కానీ, ట్రాఫిక్ సిబ్బందికి కానీ చెల్లించాలన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గించాల్సిన బాధ్యత పౌరులపై ఉందని చెప్పారు. పీఎం రహత్, గోల్డెన్ అవర్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
