రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను ఆపాలి..
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను ఆపాలి..
జీవో ఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేయాలి
ఇబ్రహీంపట్నంలో దస్తావేజు లేఖరుల ధర్నా
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ప్రైవేటీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ జిల్లా దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ ప్రభుత్వ చర్యల వల్ల దస్తావేజు లేఖరుల వృత్తి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖరుల లైసెన్సులను పునరుద్ధరించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ఆపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని కోరారు. దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు పాల్గొన్నారు.
