బాధితుడికి రూ.6 లక్షల ఎల్‌ఓసీ పత్రం అందజేత

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన సంబారి నరసయ్యకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే వేద్మా బొజ్జు పటేల్ రూ.6 లక్షల ఎల్‌ఓసీ (Letter of Credit) నిధులను మంజూరు చేశారు. మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని మంగళవారం పెద్దూరు గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ నరసయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పిట్టల రాజన్న, నాయకులు జి. రాజన్న, రాము, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
