మర్రి ప్రవీణ రెడ్డి సేవలు చిరస్మరణీయం
మర్రి ప్రవీణ రెడ్డి సేవలు చిరస్మరణీయం
దండేపల్లి, ఆంధ్రప్రభ: మర్రి ప్రవీణ రెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని దండేపల్లి మండలం లోని మెదరిపేట మల్లిక నర్సింగ్ హోం లో ఆదివారం మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో అమ్మ అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మర్రి ప్రవీణ రెడ్డి ఒక డాక్టర్ వృత్తినే కాకుండా ఆమె ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంది పేదలకు సహాయం చేసిందని చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకె కాకుండా చుట్టుపక్కల మండలాల ప్రజలకు రాత్రి పగలు తేడా లేకుండా ఆమె వృత్తి పట్ల ఎనలేని సేవలు అందించి ప్రజల మన్నలను పొందిదని ఆమె సేవలు చిరస్మరణీయం అన్నారు. అనంతరం రోగులకు పండ్లు బ్రెడ్డు పాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్,డాక్టర్ అఖిల, కుటుంబ సభ్యులు మర్రి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీచరణ్ రెడ్డి ఆసుపత్రి సిబ్బంది, అమ్మ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
