కరాటే గ్రేడింగ్‌లో వేములవాడ విద్యార్థుల ప్రతిభ

కరాటే గ్రేడింగ్‌లో వేములవాడ విద్యార్థుల ప్రతిభ

  • 10 మందికి బ్లాక్ బెల్ట్ లు
  • 3 బ్రౌన్ బెల్టుల కైవసం
  • సిపీ గౌస్ ఆలం ప్రత్యేక అభినందనలు

వేములవాడ, ఆంధ్రప్రభ ; జిల్లా స్థాయి బ్లాక్ బెల్ట్ కరాటే గ్రేడింగ్ పరీక్షల్లో వేములవాడ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. కరీంనగర్ పట్టణంలోని వివేకానంద స్కూల్‌లో శనివారం సాయంత్రం ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. వేములవాడ ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ మాస్టర్ అబ్దుల్ మన్నన్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ పరీక్షల్లో అద్భుత ప్రదర్శన చేశారు. మొత్తం 10 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ‘బ్లాక్ బెల్ట్’ సాధించగా, మరో ముగ్గురు విద్యార్థులు ‘బ్రౌన్ బెల్ట్’ కైవసం చేసుకున్నట్లు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత్ కుమార్ వెల్లడించారు.

పోలీస్ కమిషనర్ కరాటే గ్రేడింగ్‌లో ఘన విజయం సాధించిన విద్యార్థులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ విద్యలు ఎంతో అవసరమన్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా యువతలో క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని ఆయన కొనియాడారు. విద్యార్థులు ఇలాగే రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బెల్టులు పొందిన వారిని అభినందించారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.