కర్నూలు జిల్లాలో వందేమాతరం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య సమరానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం జాతీయ గీతం 150 ఏళ్ల వేడుకలను కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరేడ్ మైదానంలో పోలీసు అధికారులు, సిబ్బంది సామూహికంగా వందేమాతరం ఆలపించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై వందేమాతరం జాతీయ గేయాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వందేమాతరం స్వాతంత్ర్య యోధులకు మనోబలం ఇచ్చిన గేయమని, అది సామాన్య ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించిదని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, డీపీఓ ఏఓ విజయలక్ష్మీ, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


