బదిలీల్లో మార్పులు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పోలీసు శాఖ అధికారులు చేసిన బదిలీలపై ముందుగా జారీ చేసిన ఆదేశాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. జిల్లా పోలీసు అధికారుల రద్దు, పదోన్నతులు, మార్పులను సంబంధిత ఉన్నతాధికారులు తాజా ఆదేశాలతో మంగళవారం ప్రకటించారు.

జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం:

  1. వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయిన ఎస్‌.ఐ. జి.ఏ. అశోక్‌ను అక్కడి నుంచి గూడూరు పోలీస్ స్టేషన్‌కు పంపిన ఆదేశాలు రద్దు చేసి, ఆయనను ఇప్పుడు కర్నూల్ తాలూకా అప్‌ఎస్‌కు మార్చారు.
  2. గూడూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌.ఐ. ఎం. తిమ్మయ్యను కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసిన ఆదేశాలు రద్దుచేసి, ఆయనను కర్నూల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
  3. కోసిగి పోలీస్ స్టేషన్‌ నుంచి కర్నూల్ 2 టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయిన ఎస్‌.ఐ. జి. హనుమంత రెడ్డిని అక్కడి నుంచి గూడూరు పోలీస్ స్టేషన్‌కు పంపారు.
  4. కర్నూల్ తాలూకా అప్‌ఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌.ఐ. ఏ.సీ. పీరయ్యను కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ
    చేశారు.ఈ మేరకు కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాలు జారీ చేసి, సంబంధిత ఎస్.ఐ.లను వెంటనే కొత్త పనిస్థలాలకు రిలీవ్‌ చేయాలని, విధుల స్వీకరణ, ఖాళీ జరిగిన తేదీలను కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు.
    ఈ మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని, సమయానికి బాధ్యతలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply