vaibhav| బుడ్డోడిని అడ్డుకోవడానికి ఎస్ఆర్‌హెచ్ వ్యూహాలు
vaibhav| బుడ్డోడిని అడ్డుకోవడానికి ఎస్ఆర్‌హెచ్ వ్యూహాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ జరుగుతుంది. ఈ 15 ఏళ్ల యువ సంచలనాన్ని అడ్డుకోవడానికి హైదరాబాద్ జట్టు అనేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అతన్ని త్వరగా వెనక్కు పంపేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ, ఒకే వ్యూహంతో కాకుండా ప్రత్యేకంగా ‘ప్లాన్ బి’, ‘ప్లాన్ సి’లతో సిద్ధంగా ఉందని సంచలన ప్రకటన చేశాడు.
వైభవ్ లాంటి బ్యాటర్‌ను ఎదుర్కోవడం సాధారణ విషయం కాదని, ఒకే బౌలింగ్ ప్లాన్‌తో అతడిని ఆపడం కష్టం అని అంగీకరించాడు. “బౌలర్‌గా మీరు మీ బలాలకే బౌలింగ్ చేయాలి. కానీ కొన్ని ప్రత్యేకమైన మ్యాచ్‌విన్నర్లు ఉంటారు. వాళ్ల కోసం అదనపు వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది” అని అన్నాడు. ఈ సీజన్‌లో వైభవ్ హైదరాబాద్ జట్టుపై ఆడిన వేగవంతమైన సెంచరీ తమకు పెద్ద హెచ్చరికగా మారిందని తెలిపాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత తమ బౌలర్లు అతడిపై ఎలా బౌలింగ్ చేయాలో మళ్లీ ఆలోచించాల్సి వచ్చిందని చెప్పాడు. “ప్లాన్ ఏ పని చేయకపోతే వెంటనే ప్లాన్ బీ, అవసరమైతే ప్లాన్ సీ కి మారాల్సిందే” అని కమిన్స్ అన్నాడు. దీనిని బట్టి అర్థం అవుతోంది వైభవ్‌ను హైదరాబాద్ జట్టు ఎంత సీరియస్‌గా తీసుకుందో స్పష్టం చేశాడు.
మరోవైపు, ఎలిమినేటర్ వంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో భయపడకుండా మరింత దూకుడుగా ఆడాలని తన టీంకు చెప్పినట్టు వెల్లడించాడు. “నో రిగ్రెట్స్ మైండ్‌సెట్ తో మైదానంలోకి దిగాలని, కన్సర్వేటివ్‌గా కాకుండా అగ్రెసివ్‌గా ఉండాలని అన్నాడు. రాజస్థాన్‌ను ఇప్పటికే లీగ్ దశలో రెండుసార్లు ఓడించామని గుర్తుచేసినా, ప్లేఆఫ్ మ్యాచ్ పూర్తిగా కొత్త ఆరంభంలాంటిదేనని చెప్పాడు. అయితే గత మ్యాచ్‌ల్లో నేర్చుకున్న పాఠాలు ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ ఐపీఎల్‌ను ఓ తుఫానులా చుట్టేశాడు. అతి చిన్న వయసులోనే ఎంతో నిర్భయంగా బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు లీగ్ దశలోని 14 ఇన్నింగ్స్‌లలో 232.27 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 583 పరుగులు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.
