నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట…..
నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట…..
రైతన్న కష్టం నేలపాలు..
కుబీర్, ఆంధ్రప్రభ : మండలంలో కుబీర్ తో పాటు నిఘ్వా,మాలేగాం,పల్సి, పార్టీకి,పార్టీ బి, తదితర గ్రామాలలో సోమవారం రాత్రి కురిసిన భారీ వడగళ్ళ అకాల వర్షంతో రైతన్నలకు కంట తడి మాత్రమే మిగిలింది. ఆరు గాలం కష్టపడి పంట చేతి కొచ్చే సమయంలో వడగాళ్లతో భారీ వర్షం కురియడంతో వరి, నువ్వు పంటలు మొక్కజొన్న, జొన్న పంట నేలకొరిగాయి. మంచి దిగుబడి ఖాయం అనుకున్న ఇప్పటికే అకాల వర్షం ఈదురు గాలులకు మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
కనీసం జొన్న పంట నువ్వులు పంటలు అయిన చేతికి వస్తాయి అని ఆశతో ఎదురు చూస్తున్న రైతన్నలకు తీవ్ర నిరాశ మిగిల్చింది ఈదురు గాలులతో వడగళ్ళ భారీ వర్షం. ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతన్న పరిస్థితి అంధకారంగా మారిపోయింది. కనీసం నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకో్వాలని రైతులు కోరుకుంటున్నారు.



