కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఆడపడుచుల వివాహాలకు అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు వరం లాంటివని ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. యగ్నేశ్వర్ రెడ్డి అన్నారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల మహిళా సమైక్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 79 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అర్హత ఉన్న లబ్ధిదారులు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం త్వరితగతిన మంజూరు చేస్తోందనిఅన్నారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తోందని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కథలప్ప, జాఫర్ రాములు జయప్రకాశ్ రెడ్డి నాగేష్ గాండ్ల నికిత ప్రశాంత్, వాణి కస్తూరి వెంకట్ రాములు ఆయా గ్రామాల జిపిఓలు తదితరులు పాల్గొన్నారు.
