జనాభా గణనను పకడ్బందీగా చేపట్టాలి…

జనాభా గణనను పకడ్బందీగా చేపట్టాలి…
లింగాపూర్ సర్పంచ్ కుమ్మరి రంజిత్
కడెం, ఆంధ్ర ప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో జరుగుతున్న జనాభా గణన ప్రక్రియను బుధవారం లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా గణనను పకడ్బందీగా చేపట్టాలని ఎన్యుమరేటర్ లకు కోరారు. ఎన్యుమరేటర్ లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును ఆయన పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు జనాభా గణనలో ఎలాంటి పొరపాటు లేకుండా ప్రతి కుటుంబ వివరాలను నమోదు చేయాలన్నారు.
ప్రభుత్వ పథకాలు అమలుకు గ్రామాల అభివృద్ధి ప్రణాళికలకు జనాభా గణన ఎంతో కీలకమని సర్పంచ్ అన్నారు ప్రజలు కూడా ఎన్యుమరేటర్ లకు సహకరించి సరైన సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనాభా గణన సూపర్ వైజర్ భూమేశ్వర్ ఎన్యుమరేటర్ లు బి మహేశ్వర్ వి కిషన్ రాజేశ్వర్ సిలువేరి లక్ష్మీనరసయ్య కావ్య రాజమణి స్థానిక పంచాయతీ కార్యదర్శి రాజు పి రాజేశ్వర్ రెడ్డి ఆకుల లచ్చన్న గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
