దండేపల్లి, (ఆంధ్రప్రభ) : దండేపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక బహుళ చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
572 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ముందుగా గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించి సత్యనారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించి, సత్య దేవుడిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించకొన్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించారాని తెలిపారు.

