ఘనంగా సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలు..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జనసేన పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్ అధ్యక్షత వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయభాను ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ముఖ్య అతిథులుగా పొల్యూషన్ కంట్రోల్ స్టేట్ డైరెక్టర్ మండలి రాజేష్, స్టేట్ రోడ్డు రవాణా డైరెక్టర్ గరికపాటి శివశంకర్, ఏఎంసీ గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చెరుకుమల్లి రాధిక, కొండపల్లి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడు యర్రంశెట్టి నాని హాజరయ్యారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉదయభాను చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి విశేషంగా పనిచేస్తున్నారని కొనియాడారు. జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.