అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలి

ఎస్‌ఐ ఉదయ్ కిరణ్

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : యువకులందరు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని స్థానిక ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ అన్నారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు మండలంలోని సుందరయ్యనగర్, జువ్విగూడ గ్రామాలలో ఆదివారం ఉదయం కార్బన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్నారు.

మత్తుపదార్థాలకు (గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి) దూరంగా ఉండాలని, గ్రామంలోకి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సరైన పత్రాలు లేని, దొంగిలించిన వాహనాలు ఉంచుకోవడం నేరమని స్పష్టం చేశారు..18సంవత్సరాలు దాటిన యువకులందరు తప్పని సరిగా డ్రైవింగ్ లైసేన్స్ తీసుకోవాలని ఆయన తెలిపారు. గ్రామాల్లోని ప్రధాన వీదుల్లో, వార్డుల్లో సీసీ కెమెరాలు అమర్చుకోవడం వల్ల నేరాలను అరికట్టవచ్చని,అవి ఎంతో ఉపయోగపడతాయని ఆయన వివరించారు.