జాతీయ స్థాయిలో రాణించిన షాకీర్‌కు ఘన సన్మానం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా సత్కారం
నల్గొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి బాడీ బిల్డింగ్, జూడో, రెజ్లింగ్ విభాగాల్లో మూడు కాంస్య పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ క్రీడాకారుడు షాకీర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి షాకీర్‌కు శాలువా కప్పి, ప్రశంసాపత్రం అందజేసి అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో ఆయన సాధించిన విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధించి తెలంగాణకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, జిల్లా కార్యదర్శి జి. శేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు చేపూరి నరసింహాచారి పాల్గొని షాకీర్‌ను అభినందించారు.
క్రీడాకారులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, షాకీర్ వంటి ప్రతిభావంతులు యువతకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఎన్జీఓల నాయకులు, ఉద్యోగులు, క్రీడాభిమానులు పాల్గొని షాకీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
