ఆదివాసి నేత ఆత్రం భీమ్రావుకు ఘన నివాళులు

జైనూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ పాలకమండలి మాజీ చైర్మన్ ఆత్రం భీమ్రావు అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న ఉట్నూర్ ఐటిడిఏ పివిటిజి ఏపివో ఆత్రం భాస్కర్, ఐటీడీఏ ఏజెన్సీ విద్యాశాఖ అధికారి గోడం చందన్ శుక్రవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జనగాం పంచాయతీలో గల గంగానగర్ వెళ్లి మాజీ డైరెక్టర్ ఆ త్రం భీమ్రావు పార్దివ దేహానికి ఆదివాసి సాంప్రదాయ బద్దంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ డైరెక్టర్ భీమారావు ఆదివాసి సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఈ గ్రామంలో పీఎం జన్మన్,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారని, ఆదివాసి లకు ఏ సమస్య ఉన్న ఐటీడీఏకు వచ్చి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేసే వారిని వారన్నారు ఆయన మృతి ఆదివాసి సమాజానికి తీరనిలోటు అని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a Reply