ఎట్టకేలకు జన్నారం విద్యుత్ శాఖ ఏఈ బదిలీ..

ఎట్టకేలకు జన్నారం విద్యుత్ శాఖ ఏఈ బదిలీ..

సబ్ ఇంజనీర్ కు ఇన్చార్జి బాధ్యతలు..
పలు అవినీతి ఆరోపణలు కూడా..

జన్నారం,ఆంధ్రప్రభ : ఎట్టకేలకు మంచిర్యాల జిల్లా జన్నారం విద్యుత్ శాఖ ఏఈ లచ్చన్నను వరంగల్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.అతని స్థానంలో స్థానిక సబ్ ఇంజనీర్ సాయిశృతిక్ ను ఇన్చార్జి ఏఈ నియమించినట్లు మంచిర్యాల విద్యుత్ శాఖ ఎస్ఈ రాజన్న చెప్పారు.సాయంత్రం ఎస్ఈ ఆంధ్రప్రభతో మాట్లాడారు.ఏఈ లచ్చన్న గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ప్రజా ప్రతినిధులతోనూ, శాఖ ఉద్యోగులతోనూ, రైతులతోనూ ఆ ఏఈ సఖ్యతగా ఉండకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత ఊరైన దండేపల్లి మండలంలోని తాళ్లపేట నుంచి విధులకు వచ్చి, పోయేవాడనే ఆరోపణలు ఉన్నాయి.

పలు అవినీతి ఆరోపణలు కూడా ఆ ఏఈపై కొంతమంది రైతులు,మరి కొంతమంది వినియోగదారులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.విద్యుత్ సమస్య వ్యవహారంలో ఏనాడు వినియోగదారులతో సక్రమంగా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతినిత్యం ఆ అధికారిపై ఎవరో ఒకరు ఉన్నతాధికారులకు ఫోన్ల ద్వారా ఫిర్యాదులు చేస్తూ వచ్చారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో జాతీయ జెండాను ఏఈ ఎగురవేలేదని బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుర్రం రాజారాంరెడ్డి,సుల్వ జనార్దన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఆది నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈ లచ్చన్నను ఎట్టకేలకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ కు బదిలీ చేశారు.