కదిరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కదిరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

  • కేసు నమోదు చేసిన పోలీసులు

కదిరి. ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని కందికుంట నారాయణమ్మ కాలనీ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆవులయ్య మామిడి తోట వద్ద ఉన్న పిల్ల కుంట వంకలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటుంది. మృతి చెందిన సమయంలో నలుపు రంగు ప్యాంటు, బనియన్ ధరించి ఉన్నాడు. మృతుడు గత మూడు రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడని, అతను హిందీ లేదా ఇతర పరభాషల్లో మాట్లాడుతున్నాడని స్థానికులు తెలిపారు.

అతను సుమారు రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని అడవి జంతువులు కొంతమేర దెబ్బతీశాయి. స్థానిక వీఆర్వో హేమంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే కదిరి టౌన్ సీఐను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply