ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని దండేపల్లి మండలం లోని మెదరిపేట శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం గురు స్వామి కుర్సెంగా అరుణ్ స్వామి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 4గంటలకు నగర సంకీర్తనలు చేసుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు 108 హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మహిళలు ఆంజనేయ స్వామి వారికి మంగళ హారతులతో వచ్చి రకరకాల పూల మాలలు తీసుకువచ్చి అలంకరించి నైవేద్యాలు సమర్పించారు.

ఆంజనేయ స్వామి భక్తులు స్వామి వారికి ఉదయం చందనం పూసి జిల్లేడు దండలతో స్వామి వారిని అలంకరించారు. దాదాపు 500 మంది స్వామి వారి కీర్తనలు చేశారు.స్వామి వారి పారాయణం కు దండేపల్లి, కాసిపేట,తాళ్లపేట నాగసముద్రం,కొత్త మామిడి పల్లి నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలు గా 108 రోజుల హనుమాన్ మాల ధరించిన గురుస్వామి కుర్సెంగా అరుణ్ స్వామిని ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నవితరణ చేశారు, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply