ఉట్నూర్‌లో కార్మికుల నిరసన ర్యాలీ

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగుల కార్మికుల హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి నెరవేర్చని పాపానికి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలి అయ్యారని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ అన్నారు. ఉట్నూర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని గత మూడు రోజులుగా చేస్తున్న నిరవేదిక శిబిరానికి శుక్రవారం ఆయన నాయకులతో కలిసి వచ్చి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల కార్మికులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చక రెండున్నర సంవత్సరాలైనా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఓపికగా ఉండి తమ సమ్మె చేస్తున్నామని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన పట్టించుకోకుండా మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల నిరాశకు గురైన డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం పై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు ఇచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేటు డ్రైవర్లతో కొన్ని బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మె శిబిరంలో బిజెపి జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్ , బిజెపి ఉట్నూర్ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, లక్కారం మాజీ ఉపసర్పంచ్ శ్రీపతి లింగ గౌడ్ నాయకులు సరిగా రాజేశ్వర్ తన్నీరు సతీష్ కుటికెల రమేష్ రామగిరి వేణు చింతల రమణ,ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు గబ్బర్ సింగ్,సంగీత, కేశవ్, ఎంఏ బేగ్, ఉష తాయి,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన ర్యాలీ..

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు నిరసనగా రోడ్డు రవాణా సంస్థ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉట్నూర్ ఆర్టీసీ డిపో ఉద్యోగులు కార్మికులు శుక్రవారం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఫ్లెక్సీ తో ఉట్నూర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వం డౌన్ లోడ్ శంకర్ గౌడ్ అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టిసి ఉద్యోగ సంఘ నాయకులు గబ్బర్ సింగ్, ఎంఏ బేగ్, కేశవ్, సంగీత , ఉష తాయి కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply