ఆటోను వెనుక నుంచి ఢీకొన్న కారు.. ఒకరు మృతి
ఆటోను వెనుక నుంచి ఢీకొన్న కారు.. ఒకరు మృతి
రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం..
తిమ్మాపూర్, (ఆంధ్రప్రభ న్యూస్): తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన ఎల్లయ్య (మృతి) ప్రాణాలు కోల్పోయాడు. వీణవంకకు చెందిన తూర్పట్టి రమేష్ తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
