Cricket | తొలి ఇన్నింగ్స్‌లో 152కే ఆలౌట్
Cricket | తొలి ఇన్నింగ్స్‌లో 152కే ఆలౌట్
కుప్పకూలిన అఫ్గాన్
Cricket | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గానిస్థాన్ జట్టు కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 6 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో రహ్మత్ షా మాత్రమే నిలకడగా ఆడి 60 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ జట్టు 152 పరుగులకే పరిమితమైంది.
