శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత

శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత

  • పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్
  • తనిఖీల్లో 40 వాహనాల స్వాధీనం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, నేరాల నియంత్రణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ఎర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ గ్రామంలో పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరై గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల బాధ్యతలపై అవగాహన కల్పించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందె శాలు, లింకులను నమ్మి వ్యక్తిగత, బ్యాంకు వివరాలను పంచుకోవద్దని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. అనంతరం వాహనాల తనిఖీలు నిర్వహించగా, సరైన పత్రాలు లేని 6 ఆటోలు, 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రం తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్ఐలు, సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply