ఓటు హక్కుతోనే మనం గౌరవించబడుతున్నం…
- ఓటు లేకపోతే మనుషులుగా చూడరని గుర్తించాలి
- ఒక్క ఓటు మిస్ కాకుండా చూసే బాధ్యత బీఆర్‌ఎస్ శ్రేణులదే
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని, ఆంధ్రప్రభ : దేశంలో ఈనాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు గౌరవించబడుతున్నారంటే అందుకు ఓటుహక్కు కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఓటరు నమోదు ఎస్ఐఆర్ కార్యక్రమంలో బాగంగా ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనకు ఓటు లేకపోతే ఇంకా 78ఏండ్లు అయినా మనుషులుగా చూడరనేది ప్రస్తుతం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో అవమానం, కన్నీరు, ఆకలి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
సర్ కార్యక్రమం నియోజకవర్గంలో నత్తనడకనే సాగుతుందని, అధికారుల లెక్కల ప్రకారం కేవలం 25 నుంచి 30 శాతం వరకే ఫాంలు నింపినట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యంగా బలహీనవర్గాల ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఓటు లేకపోతే మన వాడకు వచ్చే వారు ఉండదని, మన ముఖాలు చూసేవారు ఉండరనేది గమనించాలన్నారు. ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందుచూపుతో దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని కొట్లాడినట్లు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ, గాంధీలు డబ్బులు, ఆస్తులు, చదువు, ఇన్‌కం టాక్స్ కట్టే వాళ్లకు మాత్రమే ఓటు ఉండాలంటే ఇంకా వందేళ్ల అయినా మా వర్గాలకు ఆపరిస్థితి ఉండదని, అందుకే దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని మన ఆ హక్కు సాధించి మనకుకల్పించారని ఆయన వివరించారు.
ఓటు హక్కు ఉంది కనుకనే ఈనాడు మన దళితవాడకు పెద్దపెద్దవాళ్లు వస్తున్నారని ఆయన అన్నారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని, దేశంలో అణగారిన వర్గాలు ఇంకా ఆకలితో ఉండటానికి కారణమైన పాలకులకు మేం కనబడాలంటే మాకు ఓటు ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రజల పార్టీ అయిన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఒక్క ఓటు మిస్ కాకుండా నమోదు చేసే బాధ్యత తీసుకోవాలని ఆయన ఈ సందర్బంగా పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు తగరం శంకర్ లాల్, మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, నాయకులు పుప్పాల తిరుపతి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, నాయకులు బాలయ్య, పిల్లి సత్తయ్య, శేఖర్, లక్ష్మణ్, మైనార్టీ నాయకులు ఆసిఫ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
