మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

  • మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: మహిళా సాధికారతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మదర్ తెరెసా పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.

ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం ద్వారా కుటుంబాలు బలపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ కే. ఉదయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మెప్మా డీఎంసీ రాజేశ్వరి, సీఓ నిర్మల, ఆర్పీలు, మదర్ తెరెసా పట్టణ సమాఖ్య ఓబీలు ఎగ్గేటి రాధ, ఓరుగంటి లక్ష్మి, అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply