మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం చోరగుడి, కూడేరు శివారు నమిత పమిడిముక్కల లగుంట గ్రామాల్లో మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న మొక్కజొన్న రైతులతో పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మాట్లాడారు.

ఈ సందర్భంగా కైలే అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులను విస్మరించడం దారుణమని అన్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతులకు, ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం సమంజసం కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply