Dil Raju | బాధ్యతలు స్వీకరించిన టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌

Dil Raju | బాధ్యతలు స్వీకరించిన టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌

Dil Raju | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు దాదాపు 20 ఏళ్లుగా సన్నిహిత పరిచయం ఉందని, ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి ఈ బాధ్యతలు స్వీకరించాలని కోరడంతోనే అంగీకరించినట్లు తెలిపారు.

తాను ఈ పదవిని ఎప్పుడూ ఆశించలేదని, తనకు రాజకీయాలు సరిపడవని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యమని దిల్ రాజు పేర్కొన్నారు. తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అంశాలపై ప్రభుత్వం, చిత్రపరిశ్రమతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని ఆయన తెలిపారు.