SERP ఉద్యోగుల సంక్షేమ సంఘానికి నూతన పాలకవర్గం.. ఏకగ్రీవ ఎన్నిక

ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని నూతన కమిటీ హామీ

గోరంట్ల, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా SERP L1, L2, MSCC ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోరంట్ల మండల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, పే స్కేలు అమలు, క్యాడర్ ఫిక్సేషన్, MSCCలకు సంబంధించిన SERP హెచ్‌ఆర్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సంఘం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సంఘం నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ. లక్ష్మణ, కార్యదర్శిగా సి. రామాంజులు, కోశాధికారిగా ఎ. శంకర్, ఉపాధ్యక్షుడిగా సి. చౌడయ్య, సహాయ కార్యదర్శిగా పి. ఆదినారాయణ రెడ్డిని ఎన్నుకున్నారు.

అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు చొప్పున కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు వెంటనే బాధ్యతలు స్వీకరించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఐక్యంగా పనిచేస్తామని ఉద్యోగుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు.

సమావేశంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని, సంఘం బలోపేతానికి సహకరించాలని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.