చిన్నారులు భవిష్యత్తుకు రెండు చుక్కలు..

ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి..
ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎం ఎల్ ఏ సుజన చౌదరి..

భవానిపురం, ఆంధ్రప్రభ : చిన్నారుల బంగారు భవిష్యత్తుకి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. పశ్చిమ ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్ బీ కాలనీ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పోలియో లాంటి ప్రమాదకర వ్యాధులనుంచి చిన్నారులను రక్షించేందుకు ఈ కార్యక్రమం కీలకమన్నారు.

చిన్నారులకు వేసే రెండు పోలియో చుక్కలు జీవితానికి రక్షణగా భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్కచిన్నారికీ తల్లితండ్రులు మర్చిపోకుండా పోలియో చుక్కలు వేయించి వారిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు..