నవ దంపతులకు ఎమ్మెల్యే సుజనా పెళ్లి కానుక

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన నియోజకవర్గ పరిధిలోని నూతన దంపతుల కోసం సుజనా పెళ్లి కానుక అందజేస్తున్నారు. ఆహ్వాన పత్రికను ఆయనకు పంపిన వారికి వధువుకు చీర, వరుడుకి ప్యాంటు-షర్ట్ స్వీట్ బాక్స్ తో పాటు పసుపు కుంకుమలు కానుకగా అందిస్తున్నారు.

46వ డివిజన్, మార్కు పేటకు చెందిన బట్టు శుభకర్ రావు, సువర్ణ (లేటు) దంపతుల కుమార్తె పల్లవి, వివేక్ ల వివాహం రేపల్లెలో జరగనుంది. ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనా మిత్రా కోఆర్డినేటర్లు చిట్టి నగర్ లోని వధువు నివాసానికి వెళ్లి సుజనా పెళ్లి కానుక అందజేశారు. కొత్తజంట సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు..