Clashes | రెండు జిల్లాల్లో ఇద్దరు హత్య…
Clashes | రెండు జిల్లాల్లో ఇద్దరు హత్య…
Clashes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హింసాకాండ చెలరేగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు తీవ్రరూపం దాల్చి ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి.
హౌరా జిల్లాలో బీజేపీ కార్యకర్త జాదవ్ బార్‌ను టీఎంసీ కార్యకర్తలు హత్య చేసినట్లు ఆరోపణలు వస్తుండగా, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ కార్యకర్త అబీర్ షేక్‌ను బీజేపీ మద్దతుదారులు హత్య చేసినట్లు సమాచారం. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అదేవిధంగా జల్పాయ్‌గురిలో టీఎంసీ అభ్యర్థి కృష్ణదాస్ బీజేపీ మద్దతుదారులపై దాడి చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలను రంగంలోకి దింపిన అధికారులు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత కొనసాగుతోంది.
