చెత్తను ప్రతి ఒక్కరూ పంచాయితీ రిక్షాకు అందించాలి

చెత్తను ప్రతి ఒక్కరూ పంచాయితీ రిక్షాకు అందించాలి
- స్వచంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగమణి
ఘంటసాల, ఆంధ్రప్రభ ; చెత్తను ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చే రిక్షా కార్మికునికి అందించాలని స్వచ్చంద్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోలెం నాగమణి తెలిపారు. బుధవారం శ్రీకాకుళం పంచాయతీ కార్యాలయం వద్ద నూతన రిక్షాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు, తడి పొడి చెత్తను వేరువేరుగా అందించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి నాంచారమ్మ, మాజీ ఉప సర్పంచ్ శీలం శ్రీనివాస్, బోలెం రామారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
