TGIIC | రాయదుర్గంలో ఆకాశాన్ని తాకుతున్న భూమి ధరలు..
TGIIC | రాయదుర్గంలో ఆకాశాన్ని తాకుతున్న భూమి ధరలు..
- ఎకరం రూ.204 కోట్లు..
- TGIICC ఖజానాకు కాసుల వర్షం!
- రాయదుర్గంలో ఎకరం రూ.237 కోట్లు..
హైదరాబాద్: భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్లోబల్ లెవెల్‌లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఇక్కడి ల్యాండ్ రేట్లు కార్పొరేట్ దిగ్గజాలకే షాక్ ఇచ్చేలా ఆకాశాన్ని తాకుతున్నాయి. రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని ప్రైమ్ లొకేషన్స్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన ఇ-వేలం (e-auction) ఊహించని రేంజ్‌లో సక్సెస్ అవుతుంది.
తాజాగా టీజీఐఐసీ (TGIIIC) నిర్వహించిన వేలంలో రాయదుర్గంలోని ప్లాట్ నంబర్-4 లో ఉన్న ఒక ఎకరం భూమి అక్షరాలా రూ.204 కోట్ల భారీ ధర పలికింది. ఈరోజు మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్‌కు ప్రభుత్వం వేలం పాట నిర్వహించగా.. ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా రికార్డు స్థాయి ఆదాయం రావడం విశేషం.
అయితే, కేవలం రెండు రోజుల క్రితమే ఇదే ఏరియాలో జరిగిన మరో వేలంలో ఎకరం ధర ఏకంగా రూ.237 కోట్లు పలికి సరికొత్త రికార్డు సృష్టించింది. గత 2025లో నమోదైన రూ.177 కోట్ల బెంచ్‌మార్క్‌ను ఇది క్లీన్ స్వీప్ చేసింది. ఆ రోజు ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరింది. రియల్ భూమ్‌కు అడ్డాగా మారిన రాయదుర్గంలో కేవలం ఈ రెండు విడతల వేలం ప్రక్రియల ద్వారానే టీజీఐఐసీ (TGIIIC) ఖజానాకు సుమారు రూ.2,500 కోట్ల మేర మెగా ఆదాయం లభించింది.
గ్లోబల్ హబ్‌గా రాయదుర్గం..
హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ ఐటీ కారిడార్‌లకు హార్ట్ లాంటి నాలెడ్జ్ సిటీలో భవిష్యత్తులో రాబోయే హై-రైజ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, గ్లోబల్ ఆఫీస్ స్పేసెస్ మైండ్ లో పెట్టుకునే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఈ స్థాయిలో పోటీపడ్డారు. హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో రాయదుర్గం ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ ఏరియాగా నిలిచింది.
