ప్రజల కలను కాంగ్రెస్ సాకారం చేసింది

ప్రజల కలను కాంగ్రెస్ సాకారం చేసింది

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో నిర్మలా జగ్గారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు.

తర్వాత జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఆమె చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జార్జ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనితా సంతోష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్లు సంగీత మహేష్, రమేష్, వంశీ, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply