ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొర్రూరు పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు..
ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో సంవత్సరాలు ప్రజలు చేసిన పోరాటాలు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ ఆవిర్భావం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు..
అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు రాష్ట్ర ఉద్యమ చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పరస్పరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..
