TG | ఎయిర్‌పోర్టులో కలకలం..

TG | ఎయిర్‌పోర్టులో కలకలం..

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుడి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ పేలిపోవడంతో అక్కడికక్కడే భయాందోళనలు నెలకొన్నాయి.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో మంగళవారం స్వల్ప ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విమానంలో ఎక్కే ముందు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది లగేజీ తనిఖీ చేస్తుండగా, బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు, పొగలు రావడంతో అక్కడున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ పేలడానికి గల కారణం షార్ట్ సర్క్యూటా లేదా ఇతర సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై విమానాశ్రయ భద్రతా అధికారులు నివేదిక కోరినట్లు సమాచారం.

Leave a Reply