HYD | రైలు పట్టాలపై 15 రోజుల పసికందు..

HYD | రైలు పట్టాలపై 15 రోజుల పసికందు..
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్–లక్డీకపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 15 రోజుల పసికందును వదిలి వెళ్లడం కలకలం రేపింది.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్–లక్డీకపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై ఓ పసికందును వదిలేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సుమారు 15 రోజుల పసికందును అక్కడే వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పసికందును రక్షించారు.
ఆ తర్వాత పాపను చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే పసికందును వదిలి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
