ADB | అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి…?
కుబీర్ (ఆంధ్రప్రభ) : నిర్మల్ (Nirmal) జిల్లా కుబీర్ మండలంలోని చాత గ్రామానికి చెందిన వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి ఇవాళ తెల్లవారుజామున కలకలం రేపింది. గ్రామస్తుల సమాచారం మేరకు తాపెల్లి బలరాం గౌడ్ (Balaram Goud) (70) ఇంట్లోని కుటుంబ సభ్యులు శుభకార్యాల నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లడంతో ఇంటి వద్ద ఒంటరిగా బలరాం గౌడ్ ఉన్నాడు.
అయితే ఉదయం లేచేసరికి పక్కన ఇంటివారు అతడు రక్తపు మరకలతో మగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు గుర్తించి కుబీర్ (Kubir) పోలీస్ లకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.
