CM TOUR | సభను విజయవంతం చేయాలి..

CM TOUR | సభను విజయవంతం చేయాలి..

  • మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

CM TOUR | మక్తల్, ఆంధ్రప్రభ : డిసెంబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటనలో(on tour) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని.. అనంతరం జరిగే బహిరంగ సభకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు(Congress party ranks) పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి డాక్టర్ బాప్తి శ్రీహరి పిలుపునిచ్చారు. సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో ఆదివారం మక్తల్ పట్టణం (town of Maktal) లోని తన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 1న అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారని తెలిపారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన, మక్తల్ నుంచి జిల్లా కేంద్రం నారాయణపేటకు నాలుగు లైన్ల రోడ్డు పనులు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం (CM) పాల్గొననున్నారని మంత్రి అన్నారు. అనంతరం మక్తల్ పట్టణంలో బహిరంగ సభ ఉంటుందని అత్యధిక సంఖ్యలో జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు .ఈ సమావేశంలో మక్తల్, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply